తెలుగు భాషోద్యమకారులను ప్రోత్సహించడానికి తెలుగు కూటమి అనేక పోటీలను నిర్వహించి మెచ్చుకోళ్ళతో పాటు కాన్కలను కూడా అందిస్తున్నది. ఆ వివరాలను క్రింద ఒక్కొక్క బిందువుపై నొక్కి చూడవచ్చు.
1. కొట్ల, కార్యాలయాల పేరు పలకలను తెలుగులో రాయించడం
కాన్క: రూ. 5,000
చట్టబద్ధంగా కొట్ల, కార్యాలయాల పేరు పలకలపై పేర్లు తెలుగులో ఉండాలి. ఆయా సంస్థల యజమానులతో, అధికారులతో మాట్లాడి వారి పేరుపలకలను తెలుగులో పెట్టించాలి.
ఈ పని మొదలు పెట్టే వారు ముందుగా 94408 01883/ 95052 98565 తో మాట్లాడాలి. తరువాత ఇక్కడ కింది ఫారంలో తెలియజేయాలి.
2. జోరెత్తించే ఉద్యమ గీతం
కాన్క: రూ. 5,000
తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ పాటల కోసం తెలుగు కూటమి చూస్తున్నది.
3. జనాలను కదిలించే ఉద్యమ నినాదాలు
కాన్క: రూ. 500
ఊరేగింపులలో, సమావేశాలలో తెలుగు గురించి అందరూ అనేలా, ఒకరు ఒక వాక్యం, అంటే రెండవ భాగం అందరూ అనేటటువంటి మంచి ఉత్తేజం కలిగించే తెలుగు ఉద్యమ నినాదాలను తయారుచేయాలి.
4. పిల్లలకు ఉద్యమ పద్యాలను ఆలపించే పోటీ
బాగా పాడిన పిల్లలకు కాన్క: రూ. 500, మెచ్చాంకు
3 ఏండ్ల నుంచి 15 ఏండ్ల పిల్లలకు ఈ పోటీ. పోటీలో పాల్గొనదలచిన వారు కింది ఫారంలో నమోదు చేసుకొని ఆపై పురాణం రాంప్రసాద్ (95052 55100) గారితో మాట్లాడండి.
5. తీర్పరితో తెలుగులో తీర్పు ఇప్పించడం
కాన్క: రూ. 5,000
6. ప్రభుత్వ / ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలలో తెలుగు వాడకం మొదలు పెట్టించడం
కాన్క: రూ. 5,000
7. న్యాయస్థానంలో విన్నపాన్ని తెలుగులో ఇచ్చి వాదనలు కూడ తెలుగులో కావాలి అని కోరడం
కాన్క: రూ. 2,116
8. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుగు కోసం పని చేసి సాధించడం
కాన్క: రూ. 5,000
9. భాగ్యనగరంలో తెలుగును ఒక విషయంగా కూడ చెప్పని బడులను అధికారి దృష్టికి తెచ్చి తెలుగును చెప్పించటం
కాన్క: రూ. 5,000
భాగ్యనగరం లోని తెలుగును బోధించని బడుల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) వారికి (రాధా రెడ్డి గారు, 77022 01225, director.scert-ts@nic.in) లేక విద్యామంత్రి (సబిత 040 23459922, 23322228, min_education@telangana.gov.in) గారికి పిర్యాదు చేయవచ్చు. ఆ బడి తన విధానాన్ని మార్చుకోకపోతే, చట్టప్రకారం ఆ బడికి వారు గుర్తింపును రద్దు చేస్తారు.
10. ఉద్యమ కవితల పోటీ
నెలకు రెండు సార్లు జరిగే రచ్చబండలో ఒక కవితకు 500 రూపాయల కాన్క ఇస్తాము. గెలిచినట్లుగా సర్టిఫికెట్ ఇస్తాము. అందులో పాల్గొనదలచిన వారు ఈ ఫామ్ ను నింపాలి.
కాన్క: రూ. 500
11. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు ప్రాచుర్యానికి, అమలుకు పాటుపడటం
పలు తెలుగు సంస్థలు, ప్రముఖ తెలుగు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో సంభాషిస్తున్నారు. సమాచారాన్ని పంచుకుంటున్నారు. అయితే వీరి రాతలు ఆంగ్లం లోనే ఉంటున్నాయి. సామాజిక మాధ్యమ వేదిక ద్వారా మీరు వారితో మాట్లాడి వారిని తెలుగులో కూడా రాయించగలగడం ఈ పోటీ ఉద్దేశం. తెలుగు కూటమి ఖాతాను ప్రస్తావిస్తూ, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.
కాన్క: రూ. 5,000
12. తెలుగు భాష ఆధునికీకరణ పోటీ
ఆధునిక యుగంలో తెలుగువాడుకని పెంచడానికి అవసరమైన సాంకేతిక పనిముట్ల అభివృద్ధికి పాటుపడటం.
13. సామాజిక మాధ్యమాల్లో పొట్టి వీడియోల పోటీ
వారానికొకరికి చొప్పున తెలుగు భాషపై చేసిన పొట్టి వీడియోలకు 500 రూపాయల కాన్క ఇస్తాము. గెలిచినట్లుగా సర్టిఫికెట్ ఇస్తాము. అందులో పాల్గొనదలచిన వారు ఈ ఫామ్ ను నింపాలి.
కాన్క: రూ. 500
పై పోటీలలో పాల్గొనడానికి ముందుగా ఈ క్రింది నమోదు ఫారాన్ని పూరించండి, ఆపై 94408 01883 / 95052 98565 తో మాట్లాడి నిర్ధారించుకోండి.
ఫారం నింపేందుకు లంకె – https://forms.gle/juYL1RJDeBGGMArJ7