తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
న్యాయపాలన

తెలుగులో న్యాయ పాలన

మంగారి రాజేందర్ జింబో జిల్లా జడ్జి గా , జ్యుడీషియల్ అకాడెమి డైరెక్టర్ గా ,తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసారు 5 కథా సంపుటాలను 4 కవితా సంపుటాలను వెలువరించారు.సాహిత్య వ్యాసాలను, లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలను రాసారు , రాస్తున్నారు.

Categories
గెలుపులు రాష్ట్రేతర వార్తలు

బెంగాల్లో తెలుగుకు గుర్తింపు

42% మంది తెలుగు వారు ఉన్న అరవనాట తెలుగుకు గుర్తింపు లేదు. కాని 0.1% ఉన్న బంగ రాష్ట్రంలో తెలుగుకు గుర్తింపు వచ్చింది.

ఈ విషయమై ఉద్యమకారులు కదల వలసిన తరి వచ్చినది. అరవనాడు, కర్నాటక, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో తెలుగుకు అధికార భాషగా గుర్తింపు కోసం కదలాలి.

అరవ వారు 4% ఉన్న మలేషియా, సింగపూర్, మారిషస్ లాంటి చోట్ల తమ భాషకు గుర్హింపు తెచ్చుకొన్నారు. ఆ సూత్రాన్ని అరవనాట ఎందుకు పాటించరు అని మనం గట్టిగా అడగాలి.