Author: ఆవుల వెంకట రమణా రెడ్డి
మన అమ్మనుడిని బతికించుకోడానికి మన తెలుగుకూటమి గొప్ప ముందడుగు వేస్తున్నది ఇప్పుడు.
తెలంగాణ నాట అన్ని ఊర్లల్లోని బడులవద్ద, కాలేజీల వద్ద, రెవెన్యూ ఆఫీస్ ల వద్ద గోడలపైన నినాదాలు రాయ బూనినారు.
పదిమంది మన తెలుగు అనుగరులు ఒక వ్యాన్ లో వందరోజుల పాటు ఉరూరా తిరుగుతారు. తెలుగువారితో మాట్లాడుతారు, తెలుగు కోసము పోరాడామని చెప్తారు.
మన అమ్మనుడిపై మక్కువగల తెలుగువాళ్లు అందరూ బాగా దీన్ని మెచ్చుకోవలసిందే
తెలుగు వాళ్ళు అంతా ఈ పనిని పెద్ద ఎత్తున జరిగేలా ముందుకు తీసుకెళ్లాలి.
చుక్క చుక్క కలిసి కడలి అయినట్లు మనిషి మనిషి కలిస్తేనే ఉప్పెనలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన అమ్మనుడిని కాపాడుకోగలం.
తెలుగు వారి ఓట్లతో గెలిచినా పాలకులు తెలుగును పట్టించుకోవడం లేదు, వారిని దించాలంటే అది మనలోనే ఉంది . అందుకు అందరూ కదలండి, మన తెలుగు జాతిని లేకుండా చేసే ఏలికల పాడు బుద్ధిని ఎండగట్టండి.
మన వాట్సాప్ టెలిగ్రామ్ తెలుగుమాట జట్లలో మన తెలుగుకూటమి చేస్తున్న పనులను గమనించడమే కాకుండా మీ వంతుగా సహకారములు అందిస్తారని కోరుకుంటున్నాము.
మొదటిగా గజ్వేల్ లో గోడలపై తెలుగు నినాదాలు చూడగలరని వేడుకోలు.
తెలుగులో న్యాయ పాలన
మంగారి రాజేందర్ జింబో జిల్లా జడ్జి గా , జ్యుడీషియల్ అకాడెమి డైరెక్టర్ గా ,తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసారు 5 కథా సంపుటాలను 4 కవితా సంపుటాలను వెలువరించారు.సాహిత్య వ్యాసాలను, లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలను రాసారు , రాస్తున్నారు.