మంగారి రాజేందర్ జింబో జిల్లా జడ్జి గా , జ్యుడీషియల్ అకాడెమి డైరెక్టర్ గా ,తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేసారు 5 కథా సంపుటాలను 4 కవితా సంపుటాలను వెలువరించారు.సాహిత్య వ్యాసాలను, లెక్కలేనన్ని లీగల్ వ్యాసాలను రాసారు , రాస్తున్నారు.
Categories
2 replies on “తెలుగులో న్యాయ పాలన”
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకట రమణ గారిని ఈ రోజు తెలుగు కూటమి వుధ్యమ కారులు కలిసి “అమ్మనుడి లో న్యాయపాలన” గురించి విన్నపం ఇచ్చినందుకు అభినందనలు , మెచ్చుకోలు , జేజేలు
కవితా శీర్షిక
“ప్రతిజ్ఞ ”
ఆర్యులారా !
అమ్మా నాన్నల ముద్దు బిడ్డలారా !
మాతృభాషా మకరందం తనివితీరా గ్రోలిన సీతాకోక చిలుకలారా !
ఆంధ్ర భాషా సంపదకు చిట్ట చివరి వారసులారా !
ఈ సంగతి మీకు తెలుసా !
.
.
.
.
మీలో ప్రతి ఒక్కరు ఒక తెలుగు భాషా సైనికుడు కావాలి .
ఇంటింటా , ఊరు ఊరునా భాషోద్యమ స్ఫూర్తి కలిగించాలి .
మాతృ భాషా నైతిక సాహిత్య గ్రంధాలయాలు స్థాపించాలి .
మీరంతా చెయ్యాలి ఒక దృఢసంకల్ప “ప్రతిజ్ఞ *
.
.
.
లేకుంటే ఏమౌతుందో తెలుసా ?
.
.
.
మీతోనే మన భాషా సంస్కృతులు అంతరించబోతున్నాయి .
మీ తరువాత తరం తెలుగు లో వ్రాయలేరు
మీ బిడ్డల మాటేమో గాని మనుమలు మాత్రం తెలుగు చదువుట నేర్చు కోవడం లేదు .
ఇప్పటి మాటేమో గాను ముందు ముందు తరాలకు తెలుగు మాటలు కూడా అర్ధం కావు
మరో ఏభై ఏళ్ల నాటికి ఆంధ్ర రాష్ట్రం లో తెలుగు మాట , తెలుగు పాట , తెలుగు సినిమా , తెలుగు పత్రికలు కనబడవు
ఇది ఒక రాజకీయ ఆట కాదు
ఇది ఒక మత ప్రచారము కాదు
ఇది ఒక కుటుంబ పేరు ప్రతిష్టల సమస్య కాదు
ఇది ఆంధ్రులందరి సంస్కృతీ సాంప్రదాయ సమస్య
భావితరాలకు శాంతి సామరస్యాల సమస్య .
ఆంగ్ల భాష అద్దె భాష
అన్ని దరిద్రాలకు ఆది ఆంగ్ల భాషా సంస్కృతి
ప్రపంచ పర్యటనలకు
ఆంగ్లం అవసరమే కానీ ….
అందులోనే అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా ?
శతక పద్యాలు చదవ గలరా ? నీటి కధలు వినగలరా ?
ఆంగ్లం తోనే అభివృద్ధి అంతా ఉందనుకోవడం అవివేకం …
కంప్యూటర్ లెక్కల ప్రకారం నేటి పిల్లల పరిస్థితి ఇదిగో ….
ఇటు తెలుగు చదవలేక
అటు ఆంగ్లం అర్ధం కాక
ఎటు పోవాలో తెలియక
అయోమయం లో పడిపోయారు బాలబాలికలు
ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయాలకు వారధులు
అందుకే తెలుగు భాషను బ్రతికించుకోవాలి ..
ఎలా ..
.
.
.
మీలో ప్రతి ఒక్కరు ఒక తెలుగు భాషా సైనికుడు కావాలి .
ఇంటింటా , ఊరు ఊరునా భాషోద్యమ స్ఫూర్తి కలిగించాలి .
మాతృ భాషా నైతిక సాహిత్య గ్రంధాలయాలు స్థాపించాలి .
మీరంతా చెయ్యాలి ఒక దృఢసంకల్ప…
“ప్రతిజ్ఞ *
.
రచన
కింతలి సన్యాసిరావు
గమనిక :
మా గ్రామము మరియు పట్టణాలలో లో మేము ఏర్పాటు చేస్తున్నాము ..
‘మాతృ భాషా నైతిక సాహిత్య గ్రంధాలయాలు”
మీకు ఇది నచ్చినట్టయితే మీ స్నేహితులు బంధువులతో ఈ మెసేజ్ పంచుకోండి .
ఈనెల ఆగష్టు 15 , 2023 న ప్రతిజ్ఞ చెయ్యండి .
ఇంకా వివరాలు కావాలంటే సంప్రదించండి
కింతలి సన్యాసిరావు
9908535185