తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
తెలంగాణ

ఊరూరా గోడలపై నినాదాలతో తెలుగు కూటమి ముందడుగు

మన అమ్మనుడిని బతికించుకోడానికి మన తెలుగుకూటమి గొప్ప ముందడుగు వేస్తున్నది ఇప్పుడు.
తెలంగాణ నాట అన్ని ఊర్లల్లోని బడులవద్ద, కాలేజీల వద్ద, రెవెన్యూ ఆఫీస్ ల వద్ద గోడలపైన నినాదాలు రాయ బూనినారు.

పదిమంది మన తెలుగు అనుగరులు ఒక వ్యాన్ లో వందరోజుల పాటు ఉరూరా తిరుగుతారు. తెలుగువారితో మాట్లాడుతారు, తెలుగు కోసము పోరాడామని చెప్తారు.

మన అమ్మనుడిపై మక్కువగల తెలుగువాళ్లు అందరూ బాగా దీన్ని మెచ్చుకోవలసిందే
తెలుగు వాళ్ళు అంతా ఈ పనిని పెద్ద ఎత్తున జరిగేలా ముందుకు తీసుకెళ్లాలి.
చుక్క చుక్క కలిసి కడలి అయినట్లు మనిషి మనిషి కలిస్తేనే ఉప్పెనలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన అమ్మనుడిని కాపాడుకోగలం.
తెలుగు వారి ఓట్లతో గెలిచినా పాలకులు తెలుగును పట్టించుకోవడం లేదు, వారిని దించాలంటే అది మనలోనే ఉంది . అందుకు అందరూ కదలండి, మన తెలుగు జాతిని లేకుండా చేసే ఏలికల పాడు బుద్ధిని ఎండగట్టండి.

మన వాట్సాప్ టెలిగ్రామ్ తెలుగుమాట జట్లలో మన తెలుగుకూటమి చేస్తున్న పనులను గమనించడమే కాకుండా మీ వంతుగా సహకారములు అందిస్తారని కోరుకుంటున్నాము.

మొదటిగా గజ్వేల్ లో గోడలపై తెలుగు నినాదాలు చూడగలరని వేడుకోలు.

9 replies on “ఊరూరా గోడలపై నినాదాలతో తెలుగు కూటమి ముందడుగు”

మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వారి వారి కొట్ల యొక్క నామపలకల మీద వారి కొట్టు యొక్క నామమును తెలుగులోనే రాయించగలరని కోరుతున్నాను ధన్యవాదములు.

మా వీధి లో వున్న ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయం తెలుగు లో రాసి లేదు . దానిని మార్చటానికి ప్రయత్నిస్తాను

ప్రతి గ్రామంలోను, పట్టణం లోను తెలుగు భాషా నినాదాలు కనిపించాలి, వినిపించాలి.
ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి పాఠశాలలో మాతృభాష గొప్పదనం తెలియచేసే నినాదాలు తప్పనిసరిగా వ్రాయించాలి.

తెలుగు భాష పునఃరుద్ధరణ కై నా వంతు పనిచేస్తా.. మాతృభాష గొప్పతనాన్ని నేటి తెలుగు జాతి కి తెలియజేస్తా… తెలుగు ను బతికించుకుంటా…🌳✍️✊🙏

తెలుగోడుకు స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

%d bloggers like this: