తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

తెలుగు భాషోద్యమ గీతాల కొరకు పిలుపు

తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.

తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)

ఎంచుకోబడిన పాటలకు తగు పైకపు కాన్కలు (₹5,000) ఉంటాయి; పెద్దలతో మెచ్చాంకులు (appreciation certificates) ఇప్పిస్తాము.

మీ మిత్రులలో పాటలు రాసేవాళ్ళకు ఈ పిలుపు గురించి తెలియజేయండి.