తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
బిసెరిమి

మీ గూగుల్ ఖాతా పేరు తెలుగులో ఉందా?

ఎందుకు ఉండాలి?

తెలుగువాళ్ళం కాబట్టి మన పేరు తెలుగులో ఉండాలి. పెట్టుకోవచ్చు. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో తెలుగు టైపుచేయలేక లేదా చూపించడలో ఇబ్బందుల వల్లను, ఆంగ్లంలో పెట్టుకోవడం గతయ్యింది. కానీ, గత పదేండ్లుగా కంప్యూటర్లలో తెలుగు చూడటానికి, టైపు చేయడానికి ఉన్న సాంకేతిక ఇబ్బందులు తీరిపోయాయి. ఇంకా ఆంగ్లాన్ని పట్టుకొని వేలాడటం ఎందుకు?

తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉద్యమకారులు, తెలుగు కూటమి సభ్యులు తెలుగును అన్నిటా ముందుకు తీసుకువెళ్తున్నారు. గూగుల్ ఖాతాలో వారి పేరు తెలుగులో పెట్టుకుంటే, వారి ఆశయాన్ని అది ప్రతిబింబిస్తుంది.

ఎలా పెట్టుకోవాలి?

గూగుల్ ఖాతాలో మన పేరు వ్రాసేచోట తెలుగులో టైపు చేస్తే సరిపోతుంది. (ఈ లంకెపై నొక్కి) గూగుల్ ఖాతా అమరికలలో పేరు సంబంధిత పేజీకి వెళ్ళండి. (ఒకవేళ మీ ఖాతా లోనికి ప్రవేశించి లేకపోతే, ప్రవేశించడానికి మీ ఖాతా దాటుమాటను అడుగుతుంది, మీరు మీరేనా అని తనిఖీ చేసుకుంటుంది.)

ఆ పేజీలో “ఆఖరి పేరు” అని ఉన్నచోట మీ ఇంటిపేరును తెలుగులో ఇవ్వండి. “మొదటి పేరు” అని ఉన్న చోట మీ పేరును తెలుగులో వ్రాయండి.

గూగుల్ ఖాతాలో పేరు మార్చుకునే చోటు తెరపట్టు

తర్వాత ఆ పేజీలో అడుగున ఉన్న “సేవ్ చేయి” అనే బొత్తాన్ని నొక్కండి.

అంతే!

మీరు ఇతర భాషీయులతో కూడా తరచూ ఈమెయిలు ద్వారా వ్యవహరిస్తూంటే, మీ పేరును తెలుగు, ఆంగ్లంలో కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, “రవీంద్రనాథ్ (Ravindranath)” అని రెండు భాషలలోను పెట్టుకోవచ్చు.

ఇలానే, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా మన పేర్లు తెలుగులో పెట్టుకోవచ్చు. ఆయా సామాజిక మాధ్యమ జాలగూళ్ళలో ప్రొఫైలు పేజీకి వెళ్ళి మీ పేరును తెలుగులో పెట్టుకోవచ్చు.

Categories
బిసెరిమి

మీరు తెలుగువారని గూగుల్‌కు తెలుసా?

ఎందుకు తెలియాలి?

మీరు తెలుగువారని గూగుల్‌కు తెలిస్తే, (1) మీకు అందించే సమాచారం, సేవలు సాధ్యమైనంత వరకూ తెలుగులో అందిస్తుంది. (2) తెలుగు వాడుతున్నవారు ఉన్నారని వారికి తెలిసి, వారి సేవలలో తెలుగును మరింత మెరుగుపరుస్తారు.

ఎలా తెలియజేయాలి?

మీ గూగుల్ ఖాతాలో మీ భాష ఏమిటి అనే చెప్పే వీలు గూగుల్ కల్పిస్తున్నది. ముందుగా (ఈ లంకెపై నొక్కి) మీ గూగుల్ ఖాతాలోని భాష పేజీకి వెళ్ళండి.

(ఒకవేళ మీ ఖాతా లోనికి ప్రవేశించి లేకపోతే, ప్రవేశించడానికి మీ ఖాతా దాటుమాటను అడుగుతుంది, మీరు మీరేనా అని తనిఖీ చేసుకుంటుంది.)

భాష పేజీలో ఉన్న తర్వాత “ప్రాధాన్య భాష” అనే ఖాళీలో తెలుగు భాషను ఎంచుకోండి. ప్రత్యామ్నాయ భాషగా మీకు తెలిసిన మరో భాషను కూడా చేర్చుకోవచ్చు.

గూగుల్‌లో మన ప్రాధాన్య బాషను అమర్చుకోవడం.
గూగుల్‌లో మన ప్రాధాన్య బాషను అమర్చుకోవడం.

అంతే!

Categories
పోటీలు

తెలుగులో పద్యాలు పాడిన పిల్లలకు కాన్క

తెలుగు అంటే మక్కువను పిల్లలకు చిన్నప్పటి నుంచే కలిగించాలి. తెలుగు వారికి మాత్రమే ఉన్న ప్రత్యేక ప్రక్రియ పద్యం. మంచి తెలివితో పాటు సంగీత పరిచయం కలగాలి అంటే పిల్లలకు పద్యం పాడటం నేర్పాలి. అందుకని 3 ఏండ్ల నుంచి 15 ఏండ్ల వరకు ఉన్న పిల్లలకు తెలుగు కూటమి పద్యాల పోటీలు పెట్టుతున్నది. బాగ పాడే చిరంజీవిని రెండు వారాలకు ఒకరిని గమనించి మెచ్చాంకుతో పాటు 500 రూ.ల కాన్కను ఇస్తున్నాము.

Categories
తెలంగాణ పోటీలు

తెలుగును విషయంగా బోధించని బడులపై పిర్యాదు చేయమని పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఏ బడులలోనైనా (ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్రీయ, అంతర్జాతీయ ఏ విధానమైనా, ఏ సిలబస్ అయినా) కచ్చితంగా తెలుగును ఒక మందలగా (సబ్జెక్టుగా) బోధించాలని చట్టం ఉన్నది.

భాగ్యనగరం లోని తెలుగును బోధించని బడుల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) వారికి (రాధా రెడ్డి గారు, 77022 01225, director.scert-ts@nic.in) లేక విద్యామంత్రి (సబిత 040 23459922, 23322228, min_education@telangana.gov.in) గారికి పిర్యాదు చేయవచ్చు. ఆ బడి తన విధానాన్ని మార్చుకోకపోతే, చట్టప్రకారం ఆ బడికి వారు గుర్తింపును రద్దు చేస్తారు.

ఇలా పిర్యాదు చేసి ఏదైనా బడిలో తెలుగు బోధనను మొదలుపెట్టించినను, లేదా తెలుగు చెప్పని బడి గుర్తింపు రద్దు చేయించినను అలా చేయించిన వారికి తెలుగు కూటమి మెచ్చాంకును మరియు రూ. 5,000 లను కాన్కగా అందిస్తుంది.

Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

కొట్ల, కార్యాలయాల పేరుపలకలపై తెలుగు కోసం పిలుపు

తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.

Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

తెలుగు భాషోద్యమ గీతాల కొరకు పిలుపు

తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.

తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)

Categories
తెలంగాణ న్యాయపాలన వార్తలు

తెలుగులో తీర్పు ఇచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ కమిటీ

వార్తలు:

Categories
అవర్గీకృతం

తెలుగు కూటమికి స్వాగతం!

తెలుగు కూటమికి స్వాగతం! తెలుగు కోసం, తెలుగు వెలుగు కోసం పోరాడే భాషాభిమానులందరికీ తెలుగు కూటమి ఒక వేదికగా పనికివస్తుందని ఆశిస్తున్నాం.