తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
పిలుపులు వార్తలు

తెలుగు కూటమి సొసైటీ

ఇంత వరకు తెలుగు కూటమి పనుల కోసం ఎక్కువ మంది చేరటానికి వీలైన సంస్థ లేదు. కొత్త వారు చేరితేనే సంస్థ సజీవంగ ఉంటుంది. వారు కూడ ఈ సంస్థ మాది అనుకోని చొరవతో పనులు చేయటం మొదలుపెడతారు. దీనిని సరిగా గమనించి వర్మ, వెంకటేశ్వరరావు కింతలి, చిన్నసూరి, ఎర్ర నాయుడు, శివాజీ పట్నాయక్, వెంకట రావు, సురేష్, జిడుగు రవీంద్రనాథ్, పారుపల్లి కోదండరామయ్య గార్లు విశాఖలో తెలుగు కూటమి సొసైటీ ను స్థాపించారు.

తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తేవాలనే ఆత్మాభిమానం ఉన్న తెలుగు వారు ఇందులో చేరాలని విన్నవిస్తున్నాం. ఈ కూటమి ప్రధాన ఆశయం తెలుగు భాష వాడుకను పెంచుట. అవసరం ఉన్నవారికి, పిల్లలకు #తెలుగు మాట్లాడుట, వ్రాయుట, చదువుట నేర్పటం. ఏడాది సభ్యత్వానికి 300 రూ., శాశ్వత సభ్యత్వానికి 5,000 రూ, దాతలుగా ఇష్టం వచ్చినంత చెల్లించవచ్చు.

సభ్యత్వం కొరకు లంకె: పైకం

Categories
తెలంగాణ పోటీలు

తెలుగును విషయంగా బోధించని బడులపై పిర్యాదు చేయమని పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఏ బడులలోనైనా (ప్రభుత్వ, ప్రయివేటు, కేంద్రీయ, అంతర్జాతీయ ఏ విధానమైనా, ఏ సిలబస్ అయినా) కచ్చితంగా తెలుగును ఒక మందలగా (సబ్జెక్టుగా) బోధించాలని చట్టం ఉన్నది.

భాగ్యనగరం లోని తెలుగును బోధించని బడుల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) వారికి (రాధా రెడ్డి గారు, 77022 01225, director.scert-ts@nic.in) లేక విద్యామంత్రి (సబిత 040 23459922, 23322228, min_education@telangana.gov.in) గారికి పిర్యాదు చేయవచ్చు. ఆ బడి తన విధానాన్ని మార్చుకోకపోతే, చట్టప్రకారం ఆ బడికి వారు గుర్తింపును రద్దు చేస్తారు.

ఇలా పిర్యాదు చేసి ఏదైనా బడిలో తెలుగు బోధనను మొదలుపెట్టించినను, లేదా తెలుగు చెప్పని బడి గుర్తింపు రద్దు చేయించినను అలా చేయించిన వారికి తెలుగు కూటమి మెచ్చాంకును మరియు రూ. 5,000 లను కాన్కగా అందిస్తుంది.