తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.
Category: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన విషయాలు
తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.
తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)