తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం!               తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!               ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి చేతలు తలపెట్టవోయ్!
Categories
పిలుపులు బిసెరిమి

సామాజిక మాధ్యమాలు – సత్తువగల కైదువు

నేడు అంతర్జాలం వల్ల ప్రపంచం మరింత దగ్గరైంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరినైనా పలకరించే అవకాశం ఉంది. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు సత్తువగల కైదువులని (ఆయుధం) గమనించిన చాగంటి మూర్తి గారు, మనం వీటిని ఉపయోగించి, ప్రభుత్వ సంస్థలకు, పలు రంగాల్లో ప్రముఖులకు తెలుగు వాడకం పెంచాలని గుర్తుచేయాలని పిలుపునిచ్చారు.

సునీల్, నరసింహమూర్తిగారు ఆ దిశగా చాలా రోజులుగా పని చేస్తున్నారు. ట్విట్టర్లో (X) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారితో తెలుగులో ట్వీట్లు పెట్టెట్టు చేసారు, విశాఖ మహానగర సంస్థతో కూడా తెలుగులో ట్వీట్లు పెట్టించారు. దానితో పాటు తెలుగు వాడకం అవసరాన్ని గుర్తుచేస్తూ లేఖలు కూడా పంపారు

Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

కొట్ల, కార్యాలయాల పేరుపలకలపై తెలుగు కోసం పిలుపు

తెలుగు రాష్ట్రాలలోని జిల్లా ముఖ్య పట్టణాలు, నగరాలలో కొట్లు, దుకాణాలు, కార్యాలయాల పేరుపలకలు తెలుగులో వ్రాయించడం కోసం పిలుపు. చట్టబద్ధంగా తెలుగులో ఉండాల్సినవి ఇవి. ఆయా సంస్థల యజమానులతో పేరుపలకలను తెలుగులో పెట్టించగలిగే భాషోద్యమ కార్యకర్తలకు తెలుగు కూటమి తగు పైకం, మెచ్చాంకులతో సత్కరించ తలపెట్టింది.

Categories
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిలుపులు పోటీలు

తెలుగు భాషోద్యమ గీతాల కొరకు పిలుపు

తెలుగు తియ్యదనం గురించి, తెలుగు వ్రాతరుల గొప్పతనం గురించి, తెలుగు వ్రాయిల గొప్పతనం గురించి మట్టుకే ఇప్పటి వరకు పాటలు వచ్చాయి. తెలుగువారు కదిలేలా, కదం తొక్కేలా మీరు పాటలు వ్రాయగలరా? పాటలు విన్నాక పాడేవారు, వినే వారు, ఆడే వారు ఇక కదిలేవారిగా మారాలి. తెలుగుతో పాటు మన సంస్కృతి, కళలు, ఆటలు, పాటలు, పండుగలు, ఎఱుక చివరకు మన జాతే కడతేరి పోతుంది అన్నది తెలియజేయాలి.

తెలుగు జనాల్ని కదిలించగలిగే తెలుగు ఉద్యమ గీతాల కోసం తెలుగు కూటమి చూస్తోంది. మీ సొంత పాటలను ఈ క్రింద సమర్పించవచ్చు. (పాట రాసే ఆసక్తి ఉన్నా కూడా మీ వివరాలను మాకు తెలియజేయండి.)